Hyderabad: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం
హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.