/rtv/media/media_files/2025/04/04/hxe57HcZOlszw2jkpeHz.jpg)
Andhra Pradesh Secretariat second block VK
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఏపీ సెక్రటేరియట్లో భారీ అగ్నిప్రమాదం.. రెండో బ్లాక్‌లో చెలరేగిన మంటలు.. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.#AndhraPradesh #secretariat #fireaccident #RTV pic.twitter.com/E76aX3E1me
— RTV (@RTVnewsnetwork) April 4, 2025
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
పవన్ పేషీలో మంటలు
కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా