AC Blast: ఘోర విషాదం : గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ .. ముగ్గురు చనిపోయారు!
హరియాణాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు.