AC Blast: ఘోర విషాదం : గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ .. ముగ్గురు చనిపోయారు!

హరియాణాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు.

New Update
ac

హరియాణా(Haryana) లో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి(AC Blast) ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు. అయితే ఈ దుర్ఘటనలో సచిన్ కపూర్ దంపతుల కుమారుడు కిటికీలోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.  అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఘటన జరిగింది.  ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో  ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Also Read :  మూడో భార్య చేతిలో భర్త బలి.. కాళ్లు చేతులు కట్టి, చీరతో చుట్టి - ట్విస్టులే ట్విస్టులు..!

Also Read :  లైవ్ సూసైడ్.. చెట్టుకు ఉరేసుకున్న యువతి

సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో

ఊపిరాడక తప్పించుకునే క్రమంలో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురూ ఒకే గదిలో నిద్రిస్తుండగా.. సచిన్ కపూర్ కొడుకు మాత్రం వేరే గదిలో పడుకున్నాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. పెద్ద శబ్దంతో ఏసీ పేలిందని స్థానికుడు మయాంక్  తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఫరీదాబాద్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.  

Also Read : ITR: కొన్ని రోజులు మాత్రమే సమయం.. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!

Advertisment
తాజా కథనాలు