Raped & Assaulted: మూడు గంటల పాటూ నరకం..కదులుతున్న కారులో రేప్..

లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు.  ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది. 

New Update
rape case

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సభ సమాజం తల దించుకునే సంఘటన జరిగింది. కదులుతున్న వ్యాన్ లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఇంటికి వెళ్ళేందుకు ఎదురు చూస్తున్న మహిళను లిఫ్ట్ పేరుతో కారులోకి ఎక్కించుకుని రేప్ చేశారు. 

కొంచెం కూడా కనికరించలేదు..

సోమవారం రాత్రి 23 ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో అటుగా వెళ్తోన్న ఓ వ్యాన్ ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని, ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు అందులోకి ఎక్కించుకున్నారు. కానీ తరువాత ఆమెను ఇంటికి కాకుండా గురుగ్రామ్ రోడ్డు వైపు కారు పోనిచ్చి దాదాపు మూడు గంటలకు పైగా ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయాలని కాళ్ళావేళ్ళా పడి వేడుకున్నా కనికరించలేదు సరికాదా బెదిరింపులకు దిగారు. తనను రక్షించాలని ఆమె కేకలు వేసినా రోడ్డుపై ఉన్నవారికి వినిపించలేదు. మూడు గంటల పాటూ నరకం చూపించి చివరకు తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో ఎస్జీఎమ్ నగర్ లోని రాజా చౌక్ దగ్గర కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెకు కిందకు తోసేశారు. దీంతో ఆమెకు ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

రక్తమోడుతున్న బాధితురాలు అలాగే తన సోదరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మహిళకు ముఖంపై విపరీతంగా గాయాలయ్యాయి. డాక్టర్లు 14 కుట్లు వేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ తీవ్ర షాక్‌కు గురైందని చెప్పారు.  బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విబేధాలు కారణంగా ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు బాధితురాలు తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్టు సోదరికి చెప్పింది.

బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారు డ్రైవ్ చేసిన వాహనాన్ని సీజ్ చేశారు. బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు