పరీక్షా కేంద్రాలకు.. గ్రూప్ 1 అభ్యర్థులు | Group-1 Exam | RTV
ఏపీలో త్వరలో జరగనున్న గ్రూప్1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. అభ్యర్ధుల నుంచి వాయిదా కోసం విజ్ఞప్తులు రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ తెలిపింది.
మైనారిటీ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కలిపి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (లోయర్ గ్రేడ్ ) థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. వెట్ సైట్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలి.
కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన పరీక్ష విషయంలో అభ్యర్ధులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అవే కనుక నిజమని తేలితే మళ్ళీ CUET-UG ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పింది. జులై 15 నుంచి 19 మధ్య కాలంలో పరీక్ష ఉంటుందని తెలిపింది.
పరీక్ష జరిగిన ఒకరోజు తర్వాత రద్దు అయిన యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది ఎన్టీయే. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 ల మధ్యలో జరుగుతుందని ప్రకటించింది. అలాగే సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్ జులై 25, 27 మధ్యన నిర్వహించనున్నారు.
జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది.
యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేశారు. అది కూడా ఎగ్జామ్ జరిగిన మర్నాడే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయే మధ్యసమగ్రత లోపించిందని...అందుకే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను కండక్ట్ చేస్తామని కేంద్రం తెలిపింది.