/rtv/media/media_files/2025/04/28/vB9PeFBBt2nO2CdD8ZYY.jpg)
kodi
పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు. ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఉదయ్‌పూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన మోహన్‌లాల్ .. తొమ్మిదో తరగతి విద్యార్థిని అయిన రాహుల్ కుమార్ పరీక్ష రాయడం మధ్యలో మానేయమని చెప్పి అతనితో కోడిని కోయించాడు.
Also read : Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి!
Rajasthan Teacher Suspended for Forcing Student to Clean Chicken During Exam
— Katman (@MindoFact) April 28, 2025
In Udaipur, a government school teacher made a Class 9 student stop their exam to clean a chicken, leading to the teacher's suspension. The teacher had also dismissed the school cook earlier, sparking… pic.twitter.com/Tv7z02D2Nm
స్కీన్ తీసి ముక్కలుగా కట్ చేయించి
అంతేకాకుండా దాని స్కీన్ తీసి ముక్కలుగా కట్ చేయించాడు. ఆ తర్వాత వంట చేయమని కోడి మాంసాన్ని తన ఇంటికి పంపించాడు. ఆ గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో టీచర్ ప్రవర్తనపై వారు మండిపడ్డారు. ఇదే విషయంపై మంత్రి బాబులాల్ ఖరారీని కలిసిఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.ఈ రిపోర్ట్ ఆధారంగా టీచర్ మోహన్‌లాల్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. కాగా మోహన్‌లాల్ నెల కిందట స్కూల్ కుక్‌ను తొలగించగా అప్పటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందడం లేదు. అలాగే మోహన్‌లాల్ స్కూల్ విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also read : Nandamuri Balakrishna పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య.. ఫొటోలు వైరల్