TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. పరీక్ష ప్రశ్నలు, రాయాల్సిన విధానం గురించి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.  

author-image
By srinivas
New Update
TGPSC

TG Group-3 : తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. 1,365 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ కోసం దాదాపు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరగనుండగా.. పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. 

Also Read :  అవినాష్ ఎలిమినేటెడ్.. కానీ నబీల్ ట్విస్ట్..!

రెండు రోజులు 3 సెషన్లు..

ఈ మేరకు నవంబర్ 17న మొదటి సెషన్‌లో పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. రెండో సెషన్‌ పేపర్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. నవంబర్ 18న పేపర్‌-3 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. అయితే పరీక్ష మొదలయ్యే సమయానికి 30 నిమిషాల ముందుగానే గేట్లను మూసివేస్తామని నోటిఫికేషన్ లో పేర్కొనగా.. 9.30 గంటల లోపు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్షకు 2.30 గంటల లోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని తెలిపారు.

Also Read :  మేకపాలతో డెంగ్యూ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత?

పాటించాల్సిన జాగ్రత్తలు..  

పరీక్ష కేంద్రలోకి బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌, హాల్‌టికెట్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఏదైనా ఒకటి ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్లు ఏ4 సైజు ప్రింటు ఉండాలి. అభ్యర్థి ఫొటో, సంతకం ప్రింట్‌ కానియెడల మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. ప్రశ్నపత్రం ఓపెన్‌ చేయగానే అన్ని ప్రశ్నలు సరి చూసుకోవాలి. అభ్యుర్థుల వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు. 

Also Read :  వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

ప్రశ్నల విధానం.. 
* పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్ ప్రశ్నలు ఉంటాయి. 
* పేపర్‌-2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ అంశాలుంటాయి.
* పేపర్‌-3లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

Also Read :  పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..!

పేపరుకు 150 మార్కులు..

ఇక మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ కోసం TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సంప్రదించాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు