NEET: రేపే నీట్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు ఈ మార్పులను గమనించారా!?

వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే NEET పరీక్ష మే 4న జరగనుంది. తెలంగాణలో 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 

New Update
NEET: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్‌ లింక్

NEETUG2025 exam conduct on 04 May

NEET: వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే NEET పరీక్ష మే 4న జరగనుంది. 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. 

ఆ పెన్నులతోనే ఎగ్జామ్..

ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గం.లకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు. విద్యార్థి బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఎగ్జామ్ హాల్ లో ఇచ్చే పెన్నులతోనే పరీక్ష రాయాలి. 

Also read :  Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!

ఇవి తప్పనిసరి.. 

విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డును తీసుకురావాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌లు, పర్సులు, కలర్‌ఫుల్‌ దుస్తులు, బంగారు అభరణాలు అనుమతించరు. విద్యార్థులకోసం ఎగ్జామ్ సెంటర్ లో తాగునీటితోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సందేహాలకోసం టోల్‌ ప్రీ నంబర్‌ 1800 425 1442లో సంప్రదించాలని సూచించారు. 

Also read :  బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్‌ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!

telangana | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు