Pawan Kalyan: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు.
స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది.
ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా 23 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించింది.
ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది..
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సును అంచనా వేయడం కోసం చేసే సర్వే Gallup 2024 రిపోర్ట్ వెల్లడైంది. దీని ప్రకారం మనదేశంలో 86 శాతం మంది ఉద్యోగులు చాలా కష్టపడుతున్నాం అని చెప్పారు. అదేసమయంలో భారతదేశం అత్యధిక ఉద్యోగుల స్థిరత్వం రేటు 32% గా ఉంది.
రాకెట్లను తయారుచేసే స్పేస్ ఎక్స్, దాని ఓనర్ ఎలాన్ మస్క్ మీద ఎనిమిది మంది ఇంజనీర్లు దావా వేశారు. సెక్సిజం ఆరోపణలు చేశామంటూ తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తీసేశారని వారు ఆరోపించారు.
మాస్ సిక్ లీవ్ పెట్టిన ఉద్యోగుల మీద ఎయిర్ ఇండియా చర్యలు మొదలుపెట్టింది. మొదటగా 25 మందికి టెర్మినేషన్ లెర్లను పంపించింది. మరికొంత మందికి సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాలంటూ అల్టిమేటం లెటర్లను జారీ చేసింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి.