Cyber Trap: ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా!

సైబర్ నేరగాళ్లు మరో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని మనీలాండరింగ్ కేసు పేరుతో బెదిరించి రూ.46 లక్షలు దోచేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

New Update
cyber scam,

Cyber Crime : ఘరానా మోసానికి పాల్పడ్డారు. అమాయకులే టార్గెట్ గా అడ్డంగా దోచుకుంటున్న మాయగాళ్లు.. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించి ఖాతా ఖాళీ చేశారు. మనీ లాండరింగ్ జరిగిదంటూ భయాందోళనకు గురి చేసి ఏకంగా రూ. 46 లక్షలు దొబ్బేసిన ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

సీబీఐ అధికారులమంటూ కలరింగ్..

ఏలూరు నగరం అశోక్ నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని నమ్మించి రూ.46 లక్షలు దోచేశారు సైబర్ మాయగాళ్ళు. నవంబర్ 8న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి శేషగిరికి వచ్చిన ఫోన్ కాల్ వచ్చింది. మీ బ్యాంక్ ఖాతా ద్వారా మనిలాండరింగ్ జరిగిందని, ముంబైలో మీ మీద కేసు నమోదైందని, తాము ముంబై పోలీసులమంటూ నమ్మించారు. ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సీబీఐ అధికారులమంటూ కలరింగ్ ఇచ్చారు. కేసుకు సంబంధించి డిపాజిట్ మని కట్టాలని, మీ మీద ఆరోపణలు అవాస్తవం అని తేలితే కట్టిన డబ్బులు తిరిగిస్తామని నమ్మించారు. తనకన్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొంత మొత్తం తీసి ట్రాన్స్ఫర్ చేశాడు శేషగిరి. శేషగిరిని నమ్మించి ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి సరిగ్గా రెండు రోజుల తర్వాత శేషగిరి ఖాతా నుంచి రూ.46 లక్షల సొమ్ము స్వాహా చేశారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: జ‌గ‌న్‌కు బిగ్ షాక్.. ఆ ఎన్నిక రద్దు చేసిన ఈసీ!

అయితే అంతటితో ఆగకుండా మిగిలిన సొమ్మును కూడా తమకు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించడంతో శేషగిరికి అనుమానం వచ్చింది. వెంటనే ఏలూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ముంబై పోలీసులమని, మని లాండరింగ్ అని భయపెట్టి తన సొమ్ము స్వాహా చేసారని పోలీసుల ఎదుట లబోదిబోమన్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: Robbinhood : ఎవరీ హానీసింగ్..? ఆసక్తికరంగా నితిన్ 'రాబిన్ హుడ్' టీజర్

Also Read :  ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు