Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు! అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.. By Bhavana 12 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Assam Government : అస్సాం (Assam) ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు (Employees) తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే తల్లిదండ్రులు, అత్తామామలు లేనివారికి ఈ సెలవులు వర్తించవని, ఆ సెలవులను వ్యక్తిగత సరదాలకు, కారణాలకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని షరతులు కూడా విధించింది. వృద్దులుగా మారుతున్న పెద్దలను గౌరవించుకునేందుకు ఈ సెలవులను ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం వివరించింది. నవంబర్ 6,8 తేదీల్లో ఈ సెలవులను వినియోగించుకోవాలని సూచించింది. ఎందుకంటే.. నవంబర్ 7న ఛత్ పూజ, 9 న రెండో శనివారం, 10న ఆదివారం సెలవులతో పాటు అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రెండు రోజుల ప్రత్యేక సెలవులు (Holidays) కలిసిరానున్నాయి. Also read: ఆర్‌ఆర్‌ఆర్ కి అవార్డుల పంట..మెరిసిన సీతామహాలక్ష్మి! #holidays #assam-government #employees #parents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి