/rtv/media/media_files/2025/08/07/ec-2025-08-07-08-26-14.jpg)
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలయింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆగస్టు 21నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ,సెప్టెంబర్ 9పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం, ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఇందులో ఎలక్టెడ్, నామినేటెడ్ సభ్యులు అందరూ ఉంటారు. ఈ ఎన్నికలలో రాష్ట్రాల శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
Notification for Vice-President's election issued; nomination process begins pic.twitter.com/qBn58xea17
— Mathang Seshagiri (@mathangcito) August 7, 2025
జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా
జగదీప్ ధన్‌ఖర్ భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాకు ఆరోగ్య కారణాలను, వైద్యుల సలహాను పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో, "ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాకు కట్టుబడి ఉండటానికి, భారత ఉపరాష్ట్రపతి పదవికి తక్షణం రాజీనామా చేస్తున్నాను" అని తెలిపారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. అయితే, ఆయన రాజీనామా వెనుక ఇతర కారణాలు ఉండవచ్చని ప్రతిపక్షాలు అంటున్నాయి. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయని, ముఖ్యంగా ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ప్రతిపక్ష ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ధన్‌ఖర్ ఆమోదించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన రాజీనామాకు ఆరోగ్య కారణాలతో పాటు, రాజకీయ విభేదాలు కూడా కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : Bihar crime : అన్యమతస్థుడితో అక్రమ సంబంధం.. వివాహితను గుండు గీయించి ఊరేగించారు!
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం అభ్యర్థి కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ఆధీనంలోని ఏ విధమైన పదవిలోనూ ఉండకూడదు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఉపరాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. ఓటు వేయడానికి రహస్య బ్యాలెట్ విధానం ఉపయోగించబడుతుంది. ఉపరాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే, వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఐదేళ్ల పూర్తి పదవీకాలం అధికారంలో ఉంటారు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దీనికి లోక్ సభ సాధారణ మెజారిటీతో ఆమోదం తెలపాలి. అయితే, ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు కనీసం 14 రోజుల ముందుగానే ఉపరాష్ట్రపతికి నోటీసు ఇవ్వాలి.
Also Read : SI Murder : తండ్రికొడకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సైని దారుణంగా నరికి చంపారు!