ECI: లోక్‌సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు

లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Telangana :  ఆ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. ఏ పార్టీవంటే

Election Commission of India: లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఓటర్లను ఆకర్షించేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎన్నికల డబ్బులు ఒకచోట నుంచి మరోచోటుకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. అయితే తాజాగా ఈసీ (EC) ఆసక్తికమైన విషయాలు బయటపెట్టింది.

Also Read: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

తనిఖీల్లో భాగంగా మార్చి 1 నుంచి ప్రతిరోజూ సగటున అధికారులు రూ.100 కోట్ల విలువైన నగదు,ఇతర తాయిలాలను సీజ్ చేస్తున్నారని ఈసీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. 2019తో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువ అని చెప్పింది. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోలేదని తెలిపింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా.. నగదు, మద్యం, ఇతర తాయిలాలు పంచే ప్రలోభాలకు అడ్డుకట్ట వేస్తామని వెల్లడించింది. ఇందు కోసం తనిఖీలు మరింత కట్టుదిట్టంగా చేస్తామని స్పష్టం చేసింది.

Also Read: వరుసగా పార్టీలు పెడుతున్న హీరోలు…విజయ్ తర్వాత విశాల్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు