BIG BREAKING : ఐదు రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్!

ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్లో  నాలుగు, పంజాబ్(ఉప ఎన్నిక) ఖాళీగా ఉన్న ఐదు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. 

New Update
BREAKING

BREAKING

ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్లో  నాలుగు, పంజాబ్(ఉప ఎన్నిక) ఖాళీగా ఉన్న ఐదు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ విడుదల కానుంది.  అక్టోబర్ 13వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 14నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 16నామినేషన్ల ఉపసంహరణకు ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా పంజాబ్లో జూలైలో ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా చేసిన తర్వాత ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

గత ఐదేళ్లుగా ఖాళీగా

ఇక జమ్మూ కశ్మీర్ లో గత ఐదేళ్లుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన తర్వాత ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి శాసనసభ రద్దు అయినందున, రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ ఎన్నికల ద్వారా రాజ్యసభకు నలుగురు సభ్యులు ఎన్నికవుతారు. వీరికి పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది. ఈ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ రాజకీయాలకు ఒక ముఖ్యమైన ఘట్టం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు.

Advertisment
తాజా కథనాలు