BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలనం.. రాహుల్‌ గాంధీకి సపోర్ట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన  ఓట్‌ చోరీ ఉద్యమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సపోర్ట్‌ చేశారు. సిస్టమాటిక్‌ ఇంటెన్సివ్ రివ్యూ - SIR చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

New Update
rahul

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన  ఓట్‌ చోరీ ఉద్యమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సపోర్ట్‌ చేశారు. సిస్టమాటిక్‌ ఇంటెన్సివ్ రివ్యూ - SIR చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా కంటే ముందు ఎన్నికల కమిషన్‌ను సవరించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.  EC ప్రెస్‌మీట్‌ సమాధానాల కంటే అనేక ప్రశ్నలకు తావు ఇచ్చిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈసీ సమాధానాలు చెప్పకుండా..   సాకులు చెప్పిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన EC..NDA విభాగంగా మారిందని సెటైర్‌ వేశారు. EC నియామక ప్రక్రియను సవరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నకిలీ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, ఒకే చిరునామాలో అనేక ఓటర్లు వంటివి ఇందుకు ఆధారమని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగినట్లుగానే, కేవలం తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచిన 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. బిహార్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు, దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారని, ఇది ఓటు హక్కును దొంగిలించే కుట్ర అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేస్తూనే, దేశవ్యాప్తంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 

తీవ్రంగా ఖండించిన ఈసీ

అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ తన ఆరోపణలను నిరూపించడానికి ప్రమాణపత్రంతో కూడిన ఆధారాలు సమర్పించాలని ECI డిమాండ్ చేసింది. ఏడు రోజుల్లోగా ప్రమాణపత్రం సమర్పించకపోతే, ఆయన ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణించబడతాయని హెచ్చరించింది. ఓట్ చోరీ అనే పదాన్ని ఉపయోగించడం కోట్లాది మంది భారతీయ ఓటర్లు మరియు ఎన్నికల సిబ్బందిపై దాడి అని ECI పేర్కొంది. ఇంటి నెంబర్ 0 ఉన్నవారిని, ఒకే చిరునామాలో అనేక మంది ఉన్నవారిని నకిలీ ఓటర్లుగా భావించడం సరైనది కాదని, అది ఎన్నికల డేటాను తప్పుగా విశ్లేషించడమేనని ECI స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ బిహార్‌లోని ససారాం నుంచి 16 రోజుల పాటు, 1300 కి.మీ.ల వోటర్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ యాత్ర ద్వారా ఓటర్ల హక్కులను కాపాడటం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read :  ఇండియా-పాక్‌లపై ఓ కన్నేసిన అమెరికా.. మార్కో రూబియోమ షాకింగ్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు