/rtv/media/media_files/2025/03/11/KM8jeWoFbqap7RsPIfE8.jpg)
Indian rupee
Election Code : కష్టపడి సంపాదించిన సొమ్ములో ఒక రూపాయి నష్టపోయిన ఎంతో బాధపడుతాం. రేయిపగలు చమటోడ్చి కూడబెట్టిన సొమ్ము పోగొట్టుకుంటే కన్నీళ్లు పెట్టుకుంటాం. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ సొమ్ము ఎలాగైనా వెతికి పెట్టమని ప్రాధేయపడుతాం. కానీ అక్షరాల రూ.22 కోట్లు ఎవరివో చెప్పి తీసుకెళ్లండి అని ఐటీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇంతకీ అంత డబ్బు ఎవరిది? ఐటీ దగ్గర ఎందుకుంది అని అనుమానం వస్తోంది కదా! అవును ఎవరికైనా వస్తుంది.
Also read: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు
అసలు విషయం ఏంటంటే 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న సొమ్ము. ఎన్నికల సమయంలో ధనప్రవాహన్ని నివారించడానికి పోలీసులు రాష్ట్రమంతా చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాచుపల్లి, గచ్చిబౌలి, హయత్ నగర్, కవాడిగూడా, కాచిగూడల్లో తదితర ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ22 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. నవంబర్ 2023లో గచ్చిబౌలిలో ఐదు కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు. 2023 జూన్ లో మూడు కోట్లు సీజ్ చేశారు. ఇలా మొత్తం తొమ్మిది కేసుల్లో రూ.22 కోట్లు పట్టుకున్నారు.
Also read : అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
Also read: చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్
సరైన పత్రాలు తీసుకొచ్చి నగదు తీసుకెళ్లాలని సూచించారు. కానీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఆ డబ్బుకోసం మాత్రం ఎవరూ రాలేదు. దీంతో అ సొమ్మంతా ఐటీ అధికారుల వద్దే ఉండిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ డబ్బులు ఐటీ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు తాజాగా ఆ రూ. 22 కోట్ల నగదును బినామీ యాక్ట్ కింద ఐటీ (IT) అధికారులు సీజ్ చేశారు. పలువురి వద్ద నుంచి సీజ్ చేసిన ఇంత మొత్తం డబ్బులను ఎవరూ క్లైమ్ చేసుకోకపోవడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఆయా పార్టీల నాయకులు పంపిన సొమ్ము. లేదా హావాలా మార్గంలో తరలించే డబ్బు, కొంతమంది అక్కమంగా సంపాదించిన బ్లాక్ మనీ ఇలా ఎదైనా కావచ్చని అంటున్నారు. అందుకే ఆ డబ్బు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన వివవస్తోంది.
Also read : డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
Also read : CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..