/rtv/media/media_files/2025/10/13/suspicious-person-near-maitrivanam-2025-10-13-21-33-02.jpg)
Suspicious person near Maitrivanam..Rs.25 lakhs in it
Jubileehills By Elections 2025 : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపించినా, డబ్బు దొరికిన సీజ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రోజువారి తనిఖీల్లో భాగంగా అమీర్‌పేట మైత్రివనం దగ్గర చేసిన తనిఖీల్లో లెక్క చూపని నగదును స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ సీజ్ చేసింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలవుతుండటంతో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. మైత్రివనం సమీపంలో తనిఖీలు చేస్తుండగా TS09FF 6111 నంబర్ కారులో ఈ డబ్బు లభించిందది. వైజాగ్కి చెందిన శ్రీ జైరాం తలాసియా అనే వ్యక్తి ఈ డబ్బును తరలిస్తుండగా ఆయన నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ తెలిపింది. అయితే దానికి సంబందించి ఎలాంటి రశీదులు కానీ, ఇతర సాక్ష్యాలు కానీ లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
కాగా స్వాధీనం చేసుకున్న నగదును ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అదే క్రమంలో పంజాగుట్ట పోలీసులు శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న రూ.4 లక్షల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మునిసిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానిలోనూ, మెట్రోపాలిటన్ నగరంలో భాగస్వామ్యం కావడంతో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. దీనితో ఈ నియోజక వర్గం పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!