/rtv/media/media_files/2025/02/24/q2LOFEL9TIDEXApq2e43.jpg)
tg ai schools Photograph: (tg ai schools)
Govt Schools : తెలంగాణలోని ప్రభుత్వ బడులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు స్కూళ్లకు మహర్ధశ పట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక విద్యాబోధన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, AI క్లాసులు నిర్వహించడం కోసం ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read:ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
రానున్న 6 నెలల్లో 11,476 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 5,992 స్కూళ్ళలో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నది. వీటితోపాటు మరో 5,992 పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ బీఎస్ఎన్ఎల్ కు ఈ మేరకు లేఖ రాసింది. రానున్న ఆరునెలల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అమలు కానుండడంతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు విద్యాధికారులు ప్రకటించారు.
Also Read:వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!