ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.
కేజ్రీవాల్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు.
బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతను చికిత్స కోసం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం నుంచి అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన కేజ్రీవాల్ ఆప్ సొంతగానే పోటీచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని చెప్పారు.
ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో ఇదంటూ బీజేపీ కేజ్రీవాల్ ఇంటి వీడియోను విడుదల చేసింది. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. RKపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని JD గోయెంకా స్కూల్‌కు ఇ మెయిల్స్ రూపంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్ యాజమాన్యం పిల్లలను ఇంటికి పంపించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు.
హర్యాణా, పంజాబ్ రైతులు డిసెంబర్ 8 (ఆదివారం) ఛలో ఢిల్లీ ర్యాలీగా బయలుదేరారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు.
ఢిల్లీ షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ లో డిసెంబర్ 7 ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.