/rtv/media/media_files/2025/03/30/FzaIBF2lvSKBeNk1JjnM.jpg)
IPL 2025 Hyderabad Vs Delhi match in Visakhapatnam
IPL 2025: ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఓడిన హైదరాబాద్ ఢిల్లీపై గెలిచి పోరులో నిలవాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో లఖ్‌నవూపై నెగ్గిన ఢిల్లీ మంచి జోష్‌లో కనిపిస్తోంది. స్టార్క్ నేతృత్వంలోని ఢిల్లీ బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను వణింకించాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్ సైతం జట్టులోకి వస్తుండగా ఢిల్లీ బ్యాటింగ్ విభాగం మరింత బలపడనుంది.
సన్ రైజర్స్ కు అతిపెద్ద తలనొప్పి..
ఇక హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్‌తో పాటు మహ్మద్ షమి ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇది సన్ రైజర్స్ కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. బ్యాటింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే హైదరాబాద్ బ్యాటర్లు గత మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యారు. షాట్లకు అవకాశం ఇవ్వని బౌలింగ్‌తో సన్‌రైజర్స్ భీకర బ్యాటింగ్ లైనప్‌కు లఖ్‌నవూ కళ్లెం వేయగా ఢిల్లీ కూడా అదే పని చేయాలని చూస్తోంది.
పాస్ ల గొడవ..
ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో తలనొప్పి మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇప్పుడు అది మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తోందట. ఈ బాధలు ఎస్ఆర్ హెచ్ పడలేకపోతోంది. దీనికి తోడు కోరినన్ని పాస్ లు ఇవ్వలేదని ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు హెచ్ సీఏ తాళాలు కూడా వేసిందని సన్ రైజర్స్ చెబుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ బాధలు ఇక పడలేమని...అందుకే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోతామని సన్ రైజర్స్ చెబుతోంది.
: ipl-2025 | delhi | telugu-news | today telugu news