దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది!

నైజీరియాలో దారుణం జరిగింది. ఆకలికి తాళలేక రోడ్డెక్కి నిరసనలు చేసిన 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు. ఆపై కోర్టు వారికి మరణశిక్షను విధించింది. అందులో 29 మంది చిన్నారులు ఉండటం సంచలనం రేపుతోంది.

New Update
death sentenced in Nigeria

తినడానికి తిండి లేదు. ఆకలికి తట్టుకోలేకపోయారు. ఏం చేయాలో తెలియని తీవ్ర గడ్డు పరిస్థితి. కడుపునిండా తిండి దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయగా.. 29 మంది చిన్నారులకు కోర్టు మరణ శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ప్రపంచంలోనే అత్యంత పేద దేశం

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత అధిక జనాభా గల దేశం నైజిరియా. ఆఫ్రికాలో ముడి చమురుకు ప్రసిద్ధి చెందింది నైజీరియా దేశం. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా కూడా నైజీరియానే ఉంది. అయితే ఇక్కడ ఉండే ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆకలితో ప్రాణాలు విడుస్తున్నారు. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ప్రస్తుతం నైజీరియా ప్రజలు కనీసం రోజుకు ఒకపూట భోజనం కూడా దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో నైజీరియా ప్రజలు రోడ్డెక్కారు. ఉపాధి, కడుపునిండా తిండి దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు. 

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ

76 మందిపై రకరకాల కేసులు

దీంతో అక్కడి ప్రభుత్వం రోడ్డెక్కి నిరసనలు చేసిన వారిని జైళ్లలో పెట్టి శిక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగానే మొత్తం 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు. దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం మరిన్నింటిపై కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

29 పిల్లలకు ఉరిశిక్ష

దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇస్తుంది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఈ 29 పిల్లల వయసు 14 ఏళ్ల లోపే కావడంతో సంచలనంగా మారింది. 

అయితే దీనిపై పిల్లల తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదన్న న్యాయవాది వాదనను కోర్టు ఏకీభవించింది. దీంతో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో ఆక్షలు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు