AP: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..ఏపీకి మొంథా ముప్పు
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా తుపాను ముప్పు పొంచి ఉందని, మొంథా తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.