Hyderabad: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన!
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మిచౌంగ్ తుఫాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ...బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.
తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
తమిళనాడులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారింది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.