/rtv/media/media_files/2025/10/25/cyclone-montha-2025-10-25-15-21-59.jpg)
Cyclone ‘Montha’
CYCLONE MONTHA : తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా తుపాను ముప్పు(cyclone alert in ap today) పొంచి ఉందని, మొంథా తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్(Another Cyclone Effect On Andhra Pradesh) జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు (అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో) తుపాను చాలా ప్రభావం చూపనుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.విశాఖపట్నం, -తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు(cyclone alert in telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు లేనట్టే ?
Big Alert For Telugu States - CYCLONE MONTHA
తుపాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖాధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (27.10.25) నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది."దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి" అని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాధ కుమార్ చెప్పారు. ‘‘మొంథా’’ గా పిలిచే ఈ తుపాను కాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తరువాత తీరం దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది.
గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు ఉన్నట్టుండి కురవడం మధ్యలో ఆగడం...మళ్లీ భారీగా కురవడం చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ”తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని సూచించారు. తదుపరి సూచనలు వచ్చేవరకు బోట్లను లంగరు వేసి ఉంచితే మంచిది,” అని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
Follow Us