/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
శనివారం సాయంత్రానికి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడనుంది. ఇది అండమాన్ నికోబార్ దీవులకు 510 కిలోమీటర్లు, చెన్నైకి 890, విశాఖపట్నానికి 920, కాకినాడకు 920, ఒడిశాకు 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. సోమవారం అర్థరాత్రి లేదా మంళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణశాఖ వివరించింది. దీనికి మొంథా అని పేరు పెట్టింది. దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని చెబుతున్నారు. తుఫానుగా మారాక ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశముందని చెప్పింది.
మొంథా కారణంగా భారీ వర్షాలు..
మొంథా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని చెప్పింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తుఫాను తీవ్రతను బట్టి బయటకు వెళ్ళాలని సూచించింది.
తుపాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖాధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Follow Us