15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా! సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. By Seetha Ram 30 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి సైబర్ కేటుగాళ్ల వలలో మరో వృద్ధుడు చిక్కుకున్నాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ వృద్ధుడి నుంచి దాదాపు రూ.కోటికి పైగా కొట్టేశారు. తాను సంపాదించుకున్న మొత్తాన్ని కేటుగాళ్లు కొట్టేయడంతో ఆ వృద్ధుడు లబోదిబోమంటున్నాడు. ఇక తాను మోసపోయినట్లు గుర్తించి అతడు తమ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఈ ఘటన తాజాగా గుజరాత్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భవేష్ రోజియా పూర్తి వివరాలు వెల్లడించారు. Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి! 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్ గుజరాత్ కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు స్టాక్ మార్కెట్ లో వ్యాపారం చేసేవాడు. ఆయనకు స్కామర్ల నుంచి ఓ రోజు వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ వృద్ధుడు కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం కేసు నమోదు చేస్తామని.. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఇలా దాదాపు 15 రోజుల పాటు ఆ వృద్ధుడిని భయపెట్టారు. ఇది చాలా రహస్యంగా జరుగుతున్న ఇన్విస్టిగేషన్ అని ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనంతరం అకౌంట్లో ఉన్న డబ్బును తమ ఖాతాలకు పంపించాలని ఆ కేటుగాల్లు సూచించారు. Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం! ఈ కేసుకు మీకు ఎలాంటి సంబంధం లేదని తేలేవరకు ఆ డబ్బు తమవద్దే సేఫ్ గా ఉంటుందని నమ్మించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో డబ్బులు పంపించేస్తామని తెలిపారు. దీంతో అది నమ్మిన వృద్ధుడు వారు ఇచ్చిన ఖాతాలకు రూ. 1,15,00,000 పంపించాడు. ఈ వ్యవహారం అంతా దాదాపు 15 రోజుల పాటు కొనసాగింది. Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి అయితే మూడు రోజులైనా ఎప్పటికీ కేటుగాళ్ల నుంచి ఫోన్ రాకపోవడంతో ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాని సూత్రధారి పార్థ్ గోపాని అని తెలిసింది. ప్రస్తుతం అతడు కంబోడియాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన వారి నుంచి అనేక బ్యాంకులకు చెందిన 23 బ్యాంక్ చెక్ బుక్‌లు, 46 డెబిట్ కార్డులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. #gujarat #digital arrest #cyber-scam #cyber-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి