ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్నారు. అలా బాధితుడి నుంచి రూ.2.29 కోట్లు బదిలి చేయించుకున్నారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Seetha Ram 07 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో సైబర్ స్కాంలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగాలు చేసేవారు, రిటైర్డ్ ఉద్యోగులు, సంపన్నులే లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్టు పేరిట బెదిరిస్తున్నారు. ఇది రహస్య విచారణ అని.. ఎవరికైనా చెబితే వారిని కూడా జైల్లో వేస్తామని చెప్పి డబ్బు గుంజుతున్నారు. మరొకొందరు కేటుగాల్లు ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే! తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని నమ్మిస్తున్నారు. మొదట్లో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో లాభం వచ్చినట్లు చేస్తున్నారు. ఆ తర్వాత బాధితుల నుంచి కోట్లకు టోకరా వేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ ఐటీ ఉద్యోగి నుంచి దాదాపు రూ.2.29 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాచుపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫోన్ నెంబర్ ను కొందరు కేటుగాల్లు 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. ఆపై ఆ గ్రూప్ లో ఉన్నవారు మోటివేషన్ చేశారు. కొటక్ ప్రో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇది కూడా చదవండి: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్! అధిక లాభాలు వస్తాయి అంతేకాకుండా వీఐపీ ట్రేడింగ్ ప్లాన్ లో చేరాలనే ఆలోచన ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయని తెగ మెసేజ్ లు చేశారు. అయితే ఇదంతా నిజమేనని నమ్మిన ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వారు చెప్పిన యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆపై కస్టమర్ కేర్ సూచనలు మేరకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. అయితే మొదట బాగా లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించడంతో.. అలా చాలా సార్లు అతడు పెట్టుబడి పెట్టాడు. అలా లాభాలు రావడంతో నిజమేనని అనుకున్నాడు. ఆపై కేటుగాల్లు ఐపీవో షేర్లు కేటాయిస్తామంటూ దాదాపు రూ.2.29 కోట్లు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. ఇక ఆ యాప్ లో బాధితుడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చినట్లు క్రియేట్ చేశారు. ఇలా మొత్తం ఒకేసారి రూ.3.3 కోట్లు విత్ డ్రా చేసుకోవాలంటే ఇంకో రూ.40 లక్షలు కట్టాలని చెప్పారు. దీంతో అనుమొచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగం లోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నరేష్ శిందే, సౌరభ్ శిందేలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. #crime #cyber-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి