సైబర్ స్కాంలో డబ్బులు పోయాయా.. గంటలో ఇలా చేస్తే మీ సొమ్ము సేఫ్!

సైబర్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. వారి చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలి. నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయవచ్చు అని పోలీసులు చెబుతున్నారు.

New Update
cyber criminals robbed

ఈ మధ్య సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుని డబ్బులు కాజేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దొరికినంత దోచేస్తున్నారు. బాధితులను
‘డిజిటల్ అరెస్టు’ పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తూ లక్షల్లో, కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

ఆ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన వచ్చిందంటే వెంటనే మరొక తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇక ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల వ్యక్తి నుంచి దాదాపు రూ.1 కోటి 22 లక్షల 26 వేలు దోచుకున్నారు. 

దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు పోగుట్టుకున్న డబ్బులో రూ.1 కోటి 5లక్షలు రికవరీ చేశారు. మిగిలిన రూ.17 లక్షలను సైబర్ కేటుగాళ్లు విత్‌డ్రా చేసేశారు. ఇది మాత్రమే కాకుండా మరో కేసులోనూ అదే జరిగింది. దాదాపు రూ.11.55 లక్షలు కేటుగాళ్లు కొట్టేయగా.. పోలీసులు డబ్బు మొత్తాన్ని రికవరీ చేశారు. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

ఇలా ఒకవైపు నుంచి సైబర్ కేటుగాళ్లు డబ్బులు గుంజేస్తుంటే.. మరోవైపు పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేరగాళ్ల బారిన పడిన బాధితులు వెంటనే సమాచారం అందించాలని.. సమయం గడిచేకొద్ది డబ్బును రికవరీ చేసే అవకాశం తగ్గిపోతుందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే డబ్బు పోగొట్టుకున్న గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే.. నేరస్థుల అకౌంట్‌ను ఆపడం ద్వారా డబ్బును సేఫ్‌గా తిరిగి పొందవచ్చని అంటున్నారు. అయితే ఇలా జరిగిన వెంటనే ఏం చేయాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి?.. ఎందులో కంప్లైంట్ ఇవ్వాలి? అనేది పూర్తిగా తెలుసుకుందాం. 

 ఎలా ఫిర్యాదు చేయాలి?

సైబర్ నేరాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ)ను ప్రారంభించింది. ఇందులో వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, దర్యాప్తు సంస్థలను భాగస్వాములను చేసింది. అంతేకాకుండా ఫిర్యాదు చేసేందుకు 1930తో టోల్ ఫ్రీ నెంబర్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచింది. 

ఇది కూడా చూడండి:  అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

గంటలోపు ఫిర్యాదు చేస్తే సొమ్ము సేఫ్

దీంతో నేరం జరిగిన గంటలోపు ఈ నెంబర్‌కు కాల్ చేసిన వెంటనే బాధితుడి వివరాలు, మోసం చేసేందుకు నేరస్థుడు వాడిన ఫోన్ నెంబర్, ఏ విధంగా మోసం జరిగిందో సమాచారం తీసుకుంటారు. దీంతో వెంటనే బాధితుడి అకౌంట్ నెంబర్ గల బ్యాంక్‌కు సమాచారం అందించి ఆ ఖాతా నుంచి అమౌంట్ ట్రాన్సఫర్‌ను ఆపమంటారు.

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

ఒకవేళ అప్పటికే మొత్తం డబ్బు ట్రాన్సఫర్ అయిపోయిందంటే.. అక్కడ నుంచి ఏ ఏ ఖాతాలకు అమౌంట్ ట్రాన్సఫర్ చేశారో వాటిని నిలిపివేయాలని మిగతా అకౌంట్ నెంబర్ గల బ్యాంక్‌లకు అప్రమత్తం చేస్తారు. అప్పటి వరకు అకౌంట్‌లో డబ్బు ఉంటే వాటిని రికవరీ చేయొచ్చు. అయితే ఇదంతా నేరం జరిగిన గంటలోపే సమాచారం అందిస్తే పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశం ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు