వీరు పెరుగు తింటే ఎంత ప్రమాదమో?
జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే పెరుగు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీళ్ల సమస్యలు ఉన్నవారు తింటే ఇంకా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే పెరుగు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీళ్ల సమస్యలు ఉన్నవారు తింటే ఇంకా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
పాలు, పెరుగు ఎముకల ఆరోగ్యం, కండరాల మరమ్మత్తుకు సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. శరీర కొవ్వును తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె పెరుగు తినడం మంచిదట. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, బి-విటమిన్లు పుష్కలం. ఇవి ఆకలిని నియంత్రిస్తుందటున్నారు.
పెరుగుతో బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. పెరుగు-బెల్లం తింటే జీవక్రియ, హిమోగ్లోబిన్, రక్తశుద్ధి పెరుగుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచే ప్రీబయోటిక్. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు సహాయంతో డెడ్ స్కిన్ను తొలగించుకోవచ్చు. పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు, కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని ఉపయోగించడం వల్ల సమస్యలు ఉంటాయి. మాయిశ్చరైజ్ చేస్తుంది. మంట, ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.
అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు. అమెరికన్ ప్రజలు నెయ్యి కంటే వెన్నని ఎక్కువగా ఇష్టపడతారు.
పెరుగులో పెసరపప్పు, తేనె, నెయ్యి, పంచదార, ఉసిరి కలిపి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తినడం ద్వారా శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే.. పెరుగు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువగా ఉప్పు వేయకూడదని వారు అంటున్నారు.