Ghee- Curd: అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..?

అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు. అమెరికన్ ప్రజలు నెయ్యి కంటే వెన్నని ఎక్కువగా ఇష్టపడతారు.

New Update
Ghee- Curd

Ghee-Curd

Ghee- Curd: భారతీయులకు సాధారణంగా భోజనం లాస్ట్‌లో పెరుగులేకపోతే తిన్నట్టు ఉండదు. భోజనంలో కాస్త నెయ్యి చుక్క పడాల్సిందే. కానీ అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి కూడా పోరని అంటున్నారు. మనం పాలను అమృతంగానూ, నెయ్యిని బలానికి మూలంగానూ పరిగణిస్తుంటాం. కానీ అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. ఇక్కడ ప్రజలు పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులను తీసుకోరు. ఎందుకంటే పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని వారు నమ్ముతారు. 

దేశీ ఆవు నెయ్యిని బహుమతిగా..

ఇది సాల్మొనెల్లా సంక్రమణకు కారణమవుతుంది. కెనడాలో కూడా ప్రజలు పచ్చి పాలను ఉపయోగించరు. అదేవిధంగా నెయ్యికి సంబంధించి అమెరికన్ ప్రజలు ఇది ఊబకాయం, అధిక రక్తపోటువంటి వ్యాధులకు కారణమవుతుందని నమ్ముతారు. ఇక్కడ వెతికినా నెయ్యి దొరకదు. తన అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి రాష్ట్రపతికి దేశీ ఆవు నెయ్యిని బహుమతిగా ఇచ్చారు. 1950లలో అమెరికన్ రైతులు 1 టన్ను కంటే ఎక్కువ వెన్నను పోగుచేసుకున్నారని చెబుతుంటారు. కానీ అది ఉపయోగించబడలేదు.

ఇది కూడా చదవండి:  ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్‌ బటన్‌ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం

అటువంటి పరిస్థితిలో అమెరికన్ డెయిరీ నిపుణుడు లూయిస్ హెచ్ బెర్గ్వాల్డ్, భారతీయ వ్యాపారవేత్తలకు అమెరికన్ నెయ్యి రుచి చూపించారు. దానిని భారతదేశానికి ఎగుమతి చేయడం ప్రారంభించారు. అమెరికన్ ప్రజలు నెయ్యి కంటే వెన్నని ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడి వాతావరణం చల్లగా ఉండడం. వెన్న ఎక్కువసేపు నిలవడమే. భారతదేశంలో వేడి వాతావరణం కారణంగా వెన్న నిల్వ ఉండదు. కాబట్టి ఇక్కడ అది నెయ్యిగా మారుస్తారు. ఇది దాని జీవితకాలంలో ఎప్పుడూ చెడిపోదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్‌ పిచ్చితో పిల్లను చంపేసింది

 

 

ఇది కూడా చదవండి:  వైరల్‌ అవుతున్న యోగి పువ్వు నిజమేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు