/rtv/media/media_files/2026/02/14/fotojet-9-2026-02-14-19-07-55.jpg)
Lawyer murdered in Attapur
Hyderabad : హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో పట్టపగలు అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన సొంత ఆఫీసులో అడ్వకేట్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అయితే తమ అక్కను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఖదీర్ మొదటి భార్య తమ్ముల్లే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. అత్తాపూర్ సీఐ నాగేశ్వర్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సులేమాన్ నగర్లో నివాసం ఉండే మహమ్మద్ ఖదీర్ (36) జూనియర్ అడ్వకేట్ గా పనిచేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నాడు.అడ్వకేట్ ఖదీర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి.
మొదట ఎనిమిదేళ్ల క్రితం తాబస్సుమ్ ఫాతిమా అను మహిళతో ఖదీర్‌కు వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె ఉండగానే ఖదీర్ మరో మహిళ సిమ్రాన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ఖదీర్ మొదటి భార్య ఇంటికి రావడం మానేశాడు. తమ అక్కను కాదని మరో వివాహం చేసుకున్న బావపై ఫాతిమా సోదరులు కోపం పెంచుకున్నారు. శనివారం మధ్యాహ్నం సులేమాన్‌నగర్‌లోని తన ఆఫీసులో ఖదీర్ ఒంటరిగా ఉన్నాడు. ఈ సమయంలో పాతిమా సోదరుడు అనిఫ్ తన భావ ఖదీర్‌తో మాట్లాడేందుకు వచ్చాడు. అతనితో పాటు మరికొంతమంది కూడా వచ్చారు. అయితే ఆ సమయంలో వారిమధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపంతో రెచ్చిపోయని అనిఫ్ మొదట రాడ్‌తో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో మహహ్మద్ ఖదీర్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తులతో ఆరుసార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు.
ఘటన అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించడంతో పాటు కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
Follow Us