Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నియామకాలు
లోక్‌సభలో కీలక పదవులకు కాంగ్రెస్ నియామకాలు చేపట్టింది. లోక్ సభ ఉపనాయకుడిగా గౌరవ్ గొగొయ్‌ను నియమించింది. చీఫ్ విప్‌గా కె.సురేష్, విప్‌గా మాణిక్యం ఠాగూర్, మరోవిప్గా ఎండీ జావైద్ పేర్లను ప్రకటించింది. కొత్తగా పదవులు పొందినవారికి అభినందనలు చెబుతూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.