Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

New Update

Yashaswini Reddy :  ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కొండా దంపతుల జోక్యం ఎక్కువైందని.. కొండా పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది.

Also Read :  కర్వా చౌత్ రోజున ఉపవాసం ఎందుకో తెలుసా? ఈ పూజ చేస్తే భర్తలకు ఏమవుతుంది?

కొండా సురేఖకు మద్దతుగా యశస్విని 

ఇది ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన  మరుసటి రోజే..   ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొండా సురేఖకు మద్దతుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తంటూ ఆమెపై  యశస్విని ప్రశంసలు కురిపించింది. తనకు కొండా సురేఖ స్ఫూర్తి అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కొండా సురేఖ పై వ్యక్తిరేకతతో పాటు మద్దత్తు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

ఇటీవలే  కొండా సురేఖ సమంత పై చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వాక్యాలను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ సైతం ఖండిస్తూ సమంత, అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలిచారు. 

Also Read: 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

Also Read: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Advertisment
తాజా కథనాలు