జనంలోకి రానున్న కేసీఆర్‌.. వ్యూహాత్మక ప్లాన్‌తో రీ ఎంట్రీ

మాజీ సీఎం కేసీఆర్‌ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా డిసెంబర్‌ నుంచే ఆయన జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

New Update

ఈమధ్య బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ యాక్టివ్ రాజకీయాల్లో కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికలకు ముందు వివిధ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడంతో అప్పటినుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా ఒకరోజు వచ్చి అలా కనిపించి పోయారు అంతే. కానీ అసెంబ్లీలో రేవంత్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తూ మాట్లాడలేదు. ప్రస్తుతం కేసీఆర్‌ కనిపించకపోవడంతో కేటీఆర్, హరీష్‌రావు మాత్రమే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అయితే కేసీఆర్ ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. డిసెంబర్‌ నుంచే కేసీఆర్‌ జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ కుట్ర.. ఖర్గే దళిత జాతి ద్రోహి: మందకృష్ణ ఫైర్

పార్టీని గాడిన పెట్టే దిశగా

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి డిసెంబర్‌కు ఏడాది పూర్తికానుంది. దీంతో ఏడాది తర్వాత కేసీఆర్‌ మళ్లీ యాక్టీవ్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా ఆయన రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలకు మదే కేసీఆర్‌ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గాడిన పెట్టేందుకు, కేడర్‌లో జోష్ నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదు

కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతో కేసీఆర్ మొదటి నుంచి ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. అయితే, సర్కార్ వైఖరి కారణంగానే తాము మాట్లాడాల్సి వస్తోందని కూడా అప్పట్లో అన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు బాగానే స్పందిస్తున్నారని, దీన్ని ఇలాగే కొనసాగించాలని గులాబీ అధినేత వాళ్లతో అంటున్నారని సమాచారం. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.

Also Read: ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత !

జిల్లా కేంద్రాలు, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం పెంచాలని స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించాలని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. అలాగే పార్టీలోకి యువ రక్తాన్ని ఆహ్వానించాలని.. యువకులకు కీలక పదవులు ఇవ్వాలని నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటే ఇంకా చాలా అంశాలపై స్పష్టత వస్తుందని అప్పుడు సమస్యల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని కేసీఆర్ వారితో అన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి కార్యాచరణ తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. డిసెంబర్ ఏడో తేదీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ఓ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ వస్తున్నారనే వార్తతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక కాంగ్రెస్‌ సర్కారుకు దబిడి దిబిడే అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

#brs #kcr #telugu-news #congress #telangana
Advertisment
Advertisment
తాజా కథనాలు