Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారని.. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.