కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. By B Aravind 10 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. దీనిపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు. హనుమకొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని తీవ్ర విమర్శలు చేశారు. ''కొత్త పథకాల మాట దేవుడెరుగు. ఇప్పుడున్న పథకాలకే పాతరేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీ బంధు, రైతు బంధును లేకుండా చేశారు. Also Read: ప్రియుడితో పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, కారణం తెలిస్తే ! ఓట్ల కోసమే ఇప్పుడు కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుంది. కులగణనలో 175 వరకు ప్రశ్నలు వేస్తున్నారు. మీ బ్యాంకుల్లో డబ్బెంత ఉంది ? ఏసీ ఉందా ? ఫ్రిజ్ ఉందా అని అడుగుతున్నారు. కులగణన కోసం వెళ్లిన అధికారులను ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీసీల ఓట్లు తెచ్చుకునేందుకు అధికారులను బలిపశువులుగా చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అవి అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కేసీఆర్ ముందే అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అధికారంలో ఉంది. కానీ ఇంతవరకు ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ గతంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతల చిత్తశుద్ధిపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ లబ్ధి కోసమే కులగణన ప్రస్తావన తీసుకొచ్చారని'' కేటీఆర్ అన్నారు. Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా! ఇదిలాఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. మొదటి దశలో ఇళ్లకు స్టిక్కర్లు అతికించే పనులు పూర్తయ్యాయి. శనివారం నుంచి రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. ఈ దశలో అధికారులు కుటుంబ సభ్యుల విద్య, ఆర్థిక, ఉద్యోగ, సామాజిక అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తానికి 60 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. #brs #ktr #telugu-news #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి