Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ!
ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది.