Dantewada: బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి
దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతాతో దద్దరిల్లాయి. బుధవారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. అతన్ని చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది.