Chhattisgarh Maoist Encounter Updates | 1000 మంది జవాన్లు.. 10వేల తుపాకులు | RTV
నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.