
chandrahas Photograph: (chandrahas)
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు కీలక నేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి. 57 ఏళ్ల చంద్రహాస్ హైదరాబాద్ లోని జవహర్‌నగర్ పరిధి యాప్రాల్ వాసి. ఈయనపై రూ.20 లక్షల రివార్డు ఉందని చెబుతున్నారు పోలీసులు.చంద్రహాస్ మావోయిస్టులో కీలక వ్యక్తి, ఒడిశా రాష్ట్ర కమిటీ క్రింద కలహండి-కంధమల్-బౌధ్-నాయగర్ (KKBN) డివిజనల్ కమిటీ, ఈస్ట్ సబ్-జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేశారు.
Also Read : Meerpet Incident:'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!
1985లో గద్దర్ టీమ్‌లో చంద్రహాస్ కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట్లో చంద్రహాస్ జననాట్య మండలిలో పనిచేశారు. గిరిజనుల పక్షాన నిలబడి వారికి సన్నిహితంగా ఉంటూ మాడ్ ఉద్యమానికి బీజం వేశారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మాడీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పథకాలను పక్కాగా అమలు చేయడంలో చంద్రహాస్ కీలక పాత్ర పోషించారు. చంద్రహాస్ మరణం మావోయిస్టు్లకు తీరని లోటనే చెప్పాలి.
Also Read : TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు సమీపంలో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. వీరిలో17 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని .. , పోస్ట్‌మార్టం నిమిత్తం రాయ్‌పుర్‌కు తరలించారు. మిగతా మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2024లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 290గా ఉంది.