Encounter: ఒకే రోజు రెండు ఎన్కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!
మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఉదయం బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.
Amith sha: నక్సల్ ఫ్రీ ఇండియా.. మావోల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు.
Maoist: మవోయిస్టులకు బిగ్ షాక్.. కొత్తగూడెంలో 122 మంది!
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కొత్తగూడెంలో మరో 64 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో పీఎల్జీఏ బెటాలియన్ -1 కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలంగాణ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
Maoist: మావోయిస్టుల మరో దారుణం.. ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య!
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగి చెరువుకు చెందిన కారం రాజును హతమార్చారు. అలాగే మాడివి మున్నా గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసి హతమార్చినట్లు సమాచారం.
బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
చత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో 8మంది మావోలు మృతి చెందారు.
Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్!
మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది.
Maoist: 16 మంది 40 గంటల పోరాటం.. ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ!
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఏఓబీ ఉద్యమంతో అమరుడు చలపతికి 32 ఏళ్ల అనుబంధం ఉందంటూ నివాళి అర్పించింది. ఈ ఎన్కౌంటర్లో 16 మంది 40 గంటల పాటు పోరాడి ప్రాణాలొదిరారని, వారి ఆశయ సాధనకు మనమంతా పునరంకితమవుదామని పిలుపునిచ్చింది.
Gariyaband Encounter: ఎన్కౌంటర్లో చనిపోయింది చంద్రహాస్ కాదు.. ఇతనే
గరియబంద్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండు చనిపోలేదని పోలీసులు వెల్లడించారు. చినిపోయింది ధమరీ-గరియా బంద్-నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి సత్యం గాన్దే అని తెలిపారు. చనిపోయిన వారి ఫొటోలు, వివరాలను పోలీసులు వెల్లడించారు.