సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 10 మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. గొప్ప విజయం సాధించామంటూ డీఆర్ జీ బృందాలు సంబరాలు చేసుకున్నాయి.