/rtv/media/media_files/2025/02/04/SrTVReHrmO73wC4Uax1a.jpg)
Maoists killed police informer in Chhattisgarh
Maoist: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగి చెరువు గ్రామానికి చెందిన కారం రాజును హతమార్చారు. అలాగే మాడివి మున్నా అనే గ్రామస్తులను ఇన్‌ఫార్మర్ నెపంతో కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం.
హతమార్చిన దగ్గర ఓ చెట్టుకు లేఖ..
ఈ మేరకు కేంద్ర బలగాల వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అలర్ట్ అయింది. దండకారణ్యంలోని పలు ప్రాంతాల్లో ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి హత మారుస్తుంది. కొంతమందికి ప్రజా కోర్టులో కఠిన శిక్షలు విధించి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ ఫార్మర్ల కారణంగానే పార్టీ నష్టపోతుందని భావిస్తున్న మావోయిస్టులు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోస్టర్లు అంటిస్తు్న్నారు. కారం రాజును హతమార్చిన దగ్గర ఓ చెట్టుకు లేఖ అంటించిన మావోయిస్టులు.. ఇన్ ఫార్మర్లుగా ఎవరైనా పనిచేస్తుంటే మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే రాజుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం నుంచి DRG, STF, కోబ్రా 202, CRPF 222 బెటాలియన్లు కలిసి స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించాయి. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో శనివారం మావోయిస్టులు పోలీసులపైకి అడపాదడపా కాల్పులకు పాలపడ్డారు. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్ బస్తర్ ప్రాంతంలో ఇంకా పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Follow Us