/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు.
Read also : Crime News: ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!
శుక్రవారం నుంచి DRG, STF, కోబ్రా 202, CRPF 222 బెటాలియన్లు కలిసి స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించాయి. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో శనివారం మావోయిస్టులు పోలీసులపైకి అడపాదడపా కాల్పులకు పాలపడ్డారు. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందనట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్ బస్తర్ ప్రాంతంలో ఇంకా పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.