Badrinath Temple : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు.. పులకరించిన భక్తజనం
ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు.ఉదయం గర్వాల్ రైఫిల్స్ కు చెందిన భారత ఆర్మీ భక్తి సంగీతాన్ని వినిపిస్తుండగా దేవాలయ ద్వారాలను పూజారులు తెరిచారు.