/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chardham-Yatra-2024.jpg)
Chardham
జమ్మూకశ్మీర్ పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడితో ఛార్‌ధామ్ భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది లక్షల మంది భక్తులు ఛార్‌ధామ్ యాత్రకు వెళ్తుంటారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
సుమారుగా 17 వేల మంది విదేశీ యాత్రికులు..
ఇప్పటి వరకు 19.95 లక్షల మందికిపైగా భక్తులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 17 వేల మంది విదేశీ యాత్రికులు ఉన్నారు. అయితే ఉగ్రదాడి భయం వల్ల కొందరు ఈ యాత్రకు వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఛార్‌ధామ్ వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ప్రత్యేకంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లటానికి పేర్లు నమోదు చేసుకున్న విదేశీయుల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్, మలేసియా, నేపాల్, ఆస్ట్రేలియాతో పాటు 103 దేశాల పౌరులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామని వెకేషన్‌కి వెళ్లిన వారు ఉగ్రదాడికి బలి అయ్యారు. మినీ స్విట్జర్లాండ్ అయిన పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. మతం అడిగి మరి తుపాకీలతో కాల్చి చంపేశారు. కొందరు చెట్లు పొదళ్ల దగ్గర దాగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయపడ్డారు.