ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు : ఈటల
BJP MLA Etela Rajender Fires on CM KCR | ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు, ఇలాంటి నిబంధన శాసన సభకె అవమానం : ఈటల
BJP MLA Etela Rajender Fires on CM KCR | ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు, ఇలాంటి నిబంధన శాసన సభకె అవమానం : ఈటల
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాంజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుటున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం బడంగ్‌పేటలో దళితులకు 42 ఎకరాలు కేటాయిస్తే కేసీఆర్ దానిని దోచుకోవడం ప్రారంభించారని ఆరోపించారు
శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్టొన్నారు. బీఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.