అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్తో పోలికేంటన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో తెలంగాణకంటే ముందున్నాయని నిరూపిస్తే తాను రేపు ఉదయం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్నేతలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మాట్లాడే ముందు దేని గురించి మాట్లాడుతన్నామో తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు తాము ఏదో సాధించినట్లు గొప్పలు చెబుతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్
అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్తో పోలికేంటన్నారు.
Translate this News: