నేను ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్‌కే అంకితం

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్‌ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్‌ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు

New Update
నేను ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్‌కే అంకితం

తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) ఖండించారు. తాను పార్టీ మారబోతోన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నానని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి, వరుసగా 6 సార్లు ఎన్నికల్లో గెలుపొందానన్నారు. తన భార్య పద్మావతి రెడ్డి (Padmavathi Reddy) గతంలో కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారని, 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు ఉత్తమ్. ప్రస్తుతం పద్మావతి రెడ్డి(Padmavathi Reddy)పీసీసీ ఉపాధ్యక్షురాలుగా పార్టీ, ప్రజల కోసం చేస్తున్నారు. తమకు పిల్లలు లేరన్న ఉత్తమ్.. ప్రజలే తమ పిల్లలుగా భావించి వారికోసం అత్యున్నత స్థాయిలో నిరంతరం 24/7, 365 రోజులు పని చేస్తున్నాము. పలు మీడియా సంస్థలు గత 2 సంవత్సరాలుగా తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులను అణగదొక్కేందుకు, వారిని పార్టీ నుంచి తొలగించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. తాను పార్టీలో సమస్యల పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు కానీ జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తున్నానని, తాను ప్రెస్‌మీట్‌లు పెట్టి వాటి గురించి బయటకు చెప్పానన్నారు. తాను 5 సార్లు ఎమ్మెల్యే(mla)గా పని చేశానని, ఆ సమయంలో కూడా అసెంబ్లీ(Assembly), రాజ్‌ భవన్‌(Raj Bhavan), స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రమే కేసీఆర్‌(kcr)ను కలిశానన్నారు. మరోవైపు తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, భూ లావాదేవీలు కూడా లేవన్నారు. తన ప్రాణాలని సైతం పనంగా పెట్టి భారత్‌-పాక్‌ సరిహద్దు(భారత్‌-పాక్‌ సరిహద్దు)ల్లో భారత వైమానిక దళంలో పైలెట్‌(పైలట్‌)గా పని చేశానన్న ఉత్తమ్‌.. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి ప్రజా జీవితంలోకి ఎంపీలు వచ్చారు.

తాను వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా, 6వ సారి ఎంపీ(mp)గా ఎన్నికవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ హయాంలో గృహనిర్మాణ శాఖ మంత్రి(Housing Minister)గా పనిచేసినట్లు ఉత్తమ్‌ ఏర్పాటు చేశారు. తాను, తన భార్య ప్రజలమే తమ జీవితంగా భావించి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓ కాంగ్రెస్‌ నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్‌ చానెళ్లు, మీడియా సంస్థలు తమపై తప్పుడు వార్తలు రాయడం తమను బాధకు గురిచేశాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు